Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మండలంలోని తాటికొండ-జిట్టేగూడెం గ్రామ పరిధిలో సంయుక్తంగా నిర్వహిస్తున్నసమ్మక్క సారలమ్మ జాతరకు సందర్శకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతానికి సహకరించాలని జాతర చైర్మెన్, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, తాటికొండ సర్పంచ్ చల్లా ఉమాసుధీర్‌రెడ్డి, జిట్టేగూడెం సర్పంచ్ మాలోత్ లలితీహన్మంత్ అన్నారు. మంగళవారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. జాతర ప్రాంగణంలో సంద ర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిధులు రూ.7.5లక్షలు, జెడ్పీనిధులు రూ.7లక్షలతో తాగునీరు, శానిటేషన్, రహదారి మరమ్మతులు చేపట్టామని, జాతర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. విద్యుత్ నిర్వహణకు రూ.28వేలు జీపీ నుంచి వెచ్చించి, మిగిలిన సౌకర్యాల నిమిత్తం కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. జాతర అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్ సహకరించినందుకు వైస్ ఎంపీప ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. చిల్పూర్ మండలంలోని మబ్బుగుట్ట గ్రామ పరిధిలో కొత్తగా వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.50వేల విరాళాన్ని జాతర చైర్మెన ఆవుల లింగయ్య, వైస్ చైర్మెన్ పిట్టల సంపత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో తాడూరి సునిల్, పాలకుర్తి నాగరాజు పాల్గొన్నారు.