Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి తెలిపారు. రైతులకు ఎరువులు అందించడంలో అలసత్వం లేదని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘం పాలకవర్గం రెండు సంవత్సరాల కాలంలో 2018వరకు 28 కోట్ల రూపాయల రుణాన్ని గత పాలకవర్గం అందించినట్టు తెలిపారు. సుమారు 6,500 మంది రైతులకు ఎస్బీఐ బ్యాంకు ఇచ్చిన అప్పులకు వడ్డీ రూ.2 కోట్ల 80 లక్షలకు ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బ్యాంకు వడ్డీ కింద రూ.7కోట్ల వరకు చెల్లించినట్టు తెలిపారు.
ప్రభుత్వ రుణమాఫీ కింద రూ. 25 వేల లోపు అప్పు ఉన్న రైతులకు ప్రభుత్వం కేవలం రూ. 14 లక్షలు మాత్రమే విడుదల చేసిందన్నారు. రైతులకు కావలసిన ఎరువుల కోసం గతంలో మార్క్ ఫెడ్ వారు ముందస్తుగానే డీడీలు లేకుండా ఎరువులు అందించే వారన్నారు. కానీ ప్రస్తుతం మార్క్ఫెడ్ వారు డీడీలు తీయాలనే నిబంధన తీసుకు రావడంతో రైతులకు కావలసిన ఎరువుల కోసం డీడీలు తీసి సకాలంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, సొసైటీ డైరెక్టర్లు జంగిలి బాబు, మజ్జిగ రాంబాబు, మహమ్మద్ బషీర్, ఇస్లావత్ గోపి తదితరులు పాల్గొన్నారు.