Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి
నవతెలంగాణ-ఆత్మకూర్
అగ్రంపహాడ్ జాతరకు భారీ పోలీస్ బందోబస్తుతొ సిద్ధంగా ఉన్నామని ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. మంగళవారం జాతర ప్రాంగణంలో పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ శివరామయ్యలు మాట్లాడారు. జాతరలో భక్తులకు ఇబ్బందకులు కలగకుండా చూడాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు చూసుకోవాలన్నారు. పార్కింగ్ స్థలాలను అనుక్షణం పర్యవేక్షించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు కూడా దర్శన సమయంలో సంయమనం పాటించాలన్నారు. ఈ సమావేశంలో సీఐలు గణేష్ కుమార్, రమేష్ కుమార్, ఎస్ఐలు ప్రసాద్, సుమన్, ఎస్ఐ హరిత, హరిప్రియ, ఏఎస్ఐ శంకర్, వేణుగోపాల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.