Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని పలు పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం జెడ్పీ సీఈఓ సురభి వెంకటేశ్వర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలలోని సమస్యలను తెలుసుకున్నారు. అవసరాలను గుర్తించి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రవీందర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాయిత మాధవ రెడ్డి, వేలేరు జెడ్పీ పాఠశాల హెచ్ఎం పీ నాగకుమారి, సీఆర్పీలు మొగిలిచెర్ల శ్రీనివాస్, సీహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.