Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి వనం, బతుకమ్మ విగ్రహం ధ్వంసం
పోలీస్ స్టేషన్లో సర్పంచ్ ఫిర్యాదు
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కాట్రపల్లిలో ఐదుగురు యువకులు మద్యం సేవించి పల్లె ప్రకతి వనం ఆస్తులను, బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారని సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి తెలిపారు. ఈ మేరకు ఐదుగురు యువకులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ వివరాల ప్రకారం... కాట్రపల్లి గ్రామానికి చెందిన మిరియాల నరేష్, గడ్డం చరణ్ తేజ, జీడిమడ్ల వేణు, బొడిగె నవీన్, జనగాం సిద్దులు ఈ నెల 13న రాత్రి 11 గంటల ప్రాంతంలో పల్లె పకతి వనంలో మద్యం సేవించి మద్యం మత్తులోనే బీరు సీసాలు పగుల కొట్టి అక్కడే పారవేసినట్లు తెలిపారు. పార్కు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పడగొట్టడమే కాక ఇటుకలను పగలగొట్టి, పార్క్‌కు సంబంధించిన గేటును కూడా చెడగొట్టినట్లు తెలిపారు. పార్కు ముందు ప్రతిష్టించబడి ఉన్న బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మరుసటి రోజు ఉదయం పల్లె పకతి వనంలో పనిచేసే వాచర్లు బొమ్మకంటి జంపయ్య, జనగాం సారయ్యలు తన దష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఇదే విషయమై స్థానిక ఉపసర్పంచ్ అజ్మీర జోయి, ఎంపీటీసీ అజ్మేరా ఉమా రఘు సింగ్, వార్డు సభ్యులతో చర్చించి గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.