Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే ఆరూరి రమేష్
వికలాంగుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-కాశిబుగ్గ
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా మూడు రోజుల వేడుకల్లో భాగంగా మంగళవారం మూడో డివిజన్ పైడిపెల్లిలో వికలాంగుల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు మూడువేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడని అన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న వికలాంగుల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అనంతరం కెేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 3, 14వ డివిజన్ల కార్పొరేటర్లు జన్ను శిభారాణి అనిల్, తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షులు నేరెళ్ల రాజు, ముడుసు నరసింహ, సొసైటీ చైర్మన్ ఇట్యాల హరికష్ణ, నాయకులు కుమార్ యాదవ్, బుధ్దె వెంకన్న, వీర బిక్షపతి, బోనాల సాల్దన్ తదితరులు పాల్గొన్నారు.