Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- హన్మకొండ
బడుగు, బహీనవర్గాల అభివృద్ధికి పోరాడిన ధర్మబిక్షం సేవలు ఎనలేనివని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినరు భాస్కర్ అన్నారు. మంగళవారం బాలసముద్రంలో గోపా హన్మకొండ జిల్లా కమిటీ అధ్యక్షులు డా.చిర్ర రాజు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మ బిక్షంగౌడ్ శత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారన్నారు.
బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ధర్మభిక్షం చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో గోపా నాయకులు బత్తని రమేష్ గౌడ్, తాళ్ళపెళ్లి సురేష్ గౌడ్, చిర్ర ఉపేందర్ గౌడ్, దొంతు నవీన్ గౌడ్, బండి నారాయణ గౌడ్, పోషల కుమారస్వామి గౌడ్, పేరుమండ్ల అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.