Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరిరామ్
నవతెలంగాణ-నర్సంపేట
ఖాతదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకోవాలని యూనియన్ బ్యాంక్ ఏజీఎం హరిరామ్ అన్నారు. గురువారం యూనియన్ బ్యాంక్, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సెమినార్ హాల్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏజీఎం హాజరై మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ సేవలు విస్తరిస్తున్న క్రమంలో ఖాతదారులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరస్తులకు మోసపోకుండా అప్రమత్తతంగా ఉండాలని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సరైన రీతిలో వినియోగించుకున్నట్లయితే తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు.
లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ జీ సత్యజిత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జ్యోవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ ఫెన్సన్ యోజన వంటి సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రిజర్వు బ్యాంక్ సూచనల మేరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ అన్వేష్ ఆత్మనిర్బర భారత్‌పై వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ, కమిషనర్ విద్యాధర్, డాక్టర్ సుధీర్ సింగ్, యూనియన్ బ్యాంక్ మేనేజర్లు వినిపవిత్రన్, విజరు, శ్యామ్, ఎస్బీఐ రాజు, సీబీఐ అభిజిత్‌దే, జిల్లా ఎఫ్ఎల్సీ కౌన్సిలర్ టీ.భాస్కరచారి, ఎన్‌వైకే వాలంటర్లు భారత్, సీఎఫ్ఎల్ కోఆర్డినేటర్ సీహెచ్ కళ్యాణ్, ఫీల్డ్ ఇన్సిస్టుగేటర్ బీ.నరేష్, ఆర్పీలు, సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.