Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియోజకవర్గ యువజన కాంగ్రెస్
ప్రధాన కార్యదర్శి బిర్రు రాజు
నవతెలంగాణ - వర్ధన్నపేట
కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిర్రు రాజు హెచ్చరించారు. శుక్రవారం వర్ధన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలను అమలుకు నోచుకోల్ఱేనీ హామీలతో మోసం చేస్తూ గద్దె నెక్కిన కేసీఆర్ ఉద్యోగాలు ప్రకటించకపోవడం, తన కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాల ఇచ్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించి అమరులైన కుటుంబాలను ఆదుకోకపోవడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నిరుద్యోగ భతి 3016 చెల్లించక పోవడం, అబద్దాలతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి త్వరలోనే చెబుతారని హెచ్చరించారు.