Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ- హన్మకొండ
ములుగు జిల్లా పేరును సమ్మక్క, సారలమ్మ జిల్లాగా మార్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఆయన మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను వంద మంది బీసీ ప్రతినిధులతో కలిసి సందర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మేడారం జాతర వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీకన్నారు. నేడు మేడారాన్ని సందర్శించనున్న సీఎం కేసీఆర్ ములుగు జిల్లాను సమ్మక్క, సారలమ్మ జిల్లా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికష్ణ గౌడ్, సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రం గౌడ్, చిర్ర రాజు గౌడ్, తాళ్ళ సంపత్, జనగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.