Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ - చెన్నారావుపేట
సామాజిక కార్యకర్త కంది కృష్ణచైతన్య మండలంలోని ఈర్య తండాకు చెందిన ఇల్లు లేని నిరుపేద దారంసోత్ బంగ్రి, ఈర్య దంపతులకు తన సొంత ఖర్చుతో ఇల్లు నిర్మించి సీఎం జన్మదినం సందర్భంగా ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేశారు. అనంతరం నిరుపేదకు నిర్మించి ఇచ్చిన ఇంటిని ప్రారంభించారు. తదనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ కుండే మల్లయ్య, జెడ్పీటీసీ పత్తి నాయక్, వైస్ ఎంపీపీ కష్ణారెడి, మాజీ ఎంపీపీ జక్కా అశోక్, కో-ఆప్షన్ సభ్యుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.