Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/తాడ్వాయి
ఆసియా ఖండలోనే అతిపెద్ద జాతర అయిన ములుగు జిల్లా మేడారం అడవి అంతా ప్రజలతో నిండిపోయింది. జాతరలో ముఖ్యఘట్టమైన సమ్మక్క గురువారం గద్దెపైకి చేరింది. లక్షలాది మంది భక్తులు, ఆదివాసీ నృత్యాలు, డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, అధికారుల తుపాకీ కాల్పుల నడుమ సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గిరిజన పూజారులు (వడ్డెలు) మేడారం తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు గద్దెపైకి చేరారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శనివారం సమ్మక్క తిరిగి వనం చేరడంతో జాతర ముగుస్తుంది. సమ్మక్కను తీసు కువచ్చే సమయంలో మేడారం, చిలకలగుట్ట ప్రాంతమంతా జనంతో నిండిపోయింది.గురువారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. సమ్మక్క పూజారి తెల్లవారు జామునే అడవిలోకి వెళ్లి వెదురు కర్ర తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమ్మక్క గుడి నుంచి కొత్త కుండలు తెచ్చి గద్దెపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చేందుకు పూజారి కొక్కెర కష్ణయ్యతో పాటు పలువురు పూజారులు సాయంత్రం చిలకలగుట్టపైకి బయలుదేరారు. సమ్మక్క రాక సందర్భంగా చిలకలగుట్ట నుంచి గద్దె వరకు కిలోమీటరు దూరం మొత్తం రంగురంగుల ముగ్గులు వేశారు. ఆడపడుచులు నీళ్ల బిందెలు, మంగళ హారతులతో సమ్మక్కకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక