Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
నవతెలంగాణ- కోల్‌బెల్ట్
వేజ్‌బోర్డు కాలపరిమితి 10 ఏండ్ల నుంచి 5 సంవత్సరాలకు కుదింపు కార్మికులు, కార్మిక సంఘాల విజయమని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. జయ శంకర్ జిల్లా కేంద్రంలోని బీఎంఎస్ కార్యాలయంలో గురువారం బ్రాంచ్ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన జేబీసీసీఐ 3వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భారతీయ మజ్దూర్ సంఫ్‌ు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జేబీసీసీఐ సభ్యులు, జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించిందని అన్నారు. మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ కూడా ఏప్రిల్‌లో జరిగే సమావేశంలో పరిష్కారం చేస్తామని కోల్ ఇండియా చైర్మన్ హామీ ఇచ్చారని తెలిపారు. సింగరేణి అధికారులు సీఎం పీిఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాయకులు మనోజ్ కుమార్, జనార్ధన్, లక్ష్మణ్, రమేష్, సదానందం, దామోదర్, మధుకర్, జనార్ధన్, శంకర్, వెంకటస్వామి, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.Q