Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
నవతెలంగాణ-రేగొండ
శ్రీ కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. గురువారం రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆలయ చైర్మెన్ హింగే మహేందర్ ఆధ్వర్యంలో దాతల నిర్మించిన యాగశాల, శ్రీకష్ణుని విగ్రహం, హనుమాన్ విగ్రహం, గరుడ విగ్రహం, సుదర్శన చక్రంను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పుర స్కరించుకొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ఆలయ అబివృద్ధికి సహకరించిన దాతలను శాలు వాలతో సన్మానించారు. ఆలయ ఈఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ సామల పాపిరెడ్డి, సర్పంచ్ కుసుంభ రంజిత్‌కుమార్, ఆలయ డైరెక్టర్లు గైని కుమారస్వామి, గండి తిరుపతి, పోగు సుమన్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు పేరాల ప్రశాంత్, నాయకులు బిక్షపతి, శ్రీనివాస్, విక్రమ్, శ్రీరాముల మహేందర్ పాల్గొన్నారు.