Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
ఆదర్శ పాఠశాలలను అన్నివిధాల అభివృద్ధి చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాలుగు తీర్మానాలు చేశారు. విద్యార్థుల శారీరక, మానసికోల్లాసానికి క్రీడా సామాగ్రిని ప్రారంభించారు. వచ్చే నెలలో మోడల్ స్కూల్లో ఆరవతరగతి అడ్మిషన్స్, అప్లికేషన్స్ పెరిగేలా గ్రామంలో తీసుకోవా ల్సిన కార్యక్రమాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల భవనం గదులకున్న దర్వాజలు, తలుపులు శిధిలమయ్యాయని వాటి స్థానంలో నూతనవి అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మెన్ జయశంకర్, వైస్ చైర్మెన్ మమత, ప్రభాకర్, ఉపాధ్యాయులు జానీ నాయక్, కిరణ్, వెంకటేశ్వర్లు, రాజు, గణేష్, మహేందర్, రాజు పాల్గొన్నారు.