Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ నాయకులు వంగాల రామస్వామి, కంపేటి రాజయ్య
నవతెలంగాణ- కోల్బెల్ట్
ఇకపై వేజ్బోర్డ్ ఐదేండ్లకోసారి అని యాజమాన్యంతో ఒప్పందం కుదిరిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు వంగాల రామస్వామి, కంపేటి రాజయ్య తెలిపారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 గని గేట్ మీటింగ్లో వారు మాట్లాడారు. జేబీసీసీఐ మూడవ సమావేశంలో యాజమాన్యానికి, జాతీయ కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చల్లో కార్మిక సంఘాలు పట్టుబట్టి 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించేలా కృషి చేశారని అన్నారు. ఇది కార్మికుల విజయంగా అభివర్ణించారు. కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడితే యాజమాన్యం మెడలు వంచి హక్కులు సాధించుకోవచ్చని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాడేందుకు సీఐటీయూ ఎల్లవేళలా ముందుంటుందని భరోసా ఇచ్చారు. ఏప్రిల్లో జరగబోయే రెండో దఫా చర్చల్లో మరింత పురోగతి సాధించేలా కార్మిక సంఘాలు కృషి చేస్తాయని భరోసా ఇచ్చారు.