Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్‌గౌడ్ అన్నారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొ మ్మను దహనం చేశారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ అమరుల వీరుల త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తోందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ జన్మదిన వేడుకలు రోజుల తరబడి నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. జన్మదిన వేడుకలను బహిష్కరించి నిరసన కార్యక్ర మాలు చేపట్టాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వైనాల రవీందర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డిరాజుల రాజు, బోయిని మధుకర్, క్రాంతి, మహేష్, విగేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.