Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేస్తున్నారని, అక్రమ అరెస్టులు అప్రజాస్వా మికమని కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. కేసీఆర్ జన్మదినం మూడు రోజులు జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి జన్మదిన సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం లేదని నిరసన చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న పార్టీలకు ప్రజల చేతిలో పతనం ఖాయమన్నారు. నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదిన సందర్భంగా అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను బేషరతుగా విడుదల చేయకుంటే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం, ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, కౌన్సిలర్ మహేందర్, నాయకులు రజినీకాంత్గౌడ్, రాజేందర్, శ్రీనివాస్, రంజిత్, బుర్ర అనిల్, ప్రశాంత్, రాజేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.