Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతి
నవతెలంగాణ-గణపురం
పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. గురువారం గణపురం మండలానికి చెందిన కొండమల్ల మల్లికార్జున్, గాంధీనగర్ గ్రామానికి చెందిన మచ్చిక సాంబశివుడు మతి చెందగా బాధిత కుటుంబ సభ్యులకు రూ.2లక్షల విలువైన పార్టీ బీమా చెక్కుల తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొలుసాని లక్ష్మీనరసింహరావు, సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్, మారగాని సరస్వతి-శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణగౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షలు తాళ్లపల్లి కిరణ్‌గౌడ్, గుర్రం తిరుపతిగౌడ్, ఉపసర్పంచ్లు కష్ణంరాజు, అశోక్, మండల మహిళా అధ్యక్షురాలు రజిత, నాయకులు స్వామి, తదితరులు పాల్గొన్నారు.