Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీి-2 గనిని గురువారం సౌత్ సెంట్రల్ జోన్ డీఎంఎస్ (ఎలక్ట్రికల్) బిశ్వనాధ్ బెహరా, డీడీఎంఎస్ బ్రదేష్ కుమార్ దివ్య సందర్శించారు. ఈ సందర్భంగా గని సబ్ స్టేషన్ను పరిశీలించారు. ఉద్యోగులు, అధికారులు రక్షణతో కూడిన ఉత్పత్తికి సహకరించాలని కోరారు. ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని, ఎలక్ట్రికల్ ఉపకరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు, ఎస్ఓటు జీఎం ఆర్ విజయప్రసాద్, ఏజీఎం ఎన్ రామలింగం, ఏఎస్ఓ బచ్చా రవీందర్, గని పీఓ జాన్ ఆనంద్, ఏజెంట్ ఎస్వి రావు పాల్గొన్నారు.