Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్యాదవ్
నవతెలంగాణ-భూపాలపల్లి
ఎన్నో సమస్యలతో, నిత్య కలహాలతో, పౌర హక్కులు ధ్వంసం అవుతున్న నేటి రోజుల్లో సమాజ సేవలో న్యాయవాద వృత్తి కీలకపాత్ర వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రభుత్వ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సమాజ సేవలో ముందుండే మడిపెళ్లి రజినీకాంత్ లాంటివాల్లు న్యాయవాద వృత్తిలోకి రావడం వల్ల పీడిత వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో మడిపల్లి రజనీకాంత్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని ప్రమాణం చేశారు. ఈసందర్భంగా మడిపల్లి రజినీకాంత్కు ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆక్ట్-1986 పుస్తకాన్ని బహూకరించి సన్మానించి ఆయన మాట్లాడారు. న్యాయవాద వత్తిలోకి వచ్చిన రజినీకాంత్కు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఫనీంద్ర భార్గవ్, న్యాయవాదులు సాయిని నరేందర్, గాంధీ, నల్ల ప్రవీణ్, జోసేఫ్, జె స్వామి, సంజీవ్, రాజబాబు, నంద కిషోర్, ఎండీ రఫీక్, చింత నిఖిల్ రాచకొండ ప్రవీణ్, నీలం ప్రశాంత్, రాజబాబు, సందేస సామాజిక ఉద్యమారులు వనజ, నరేందర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.