Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
పేదలకు ప్రభుత్వ పద ¸కాలు అందాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి పట్టణంలోని ప్రగతిభవన్‌లో ఎంఈఓలు, హెచ్ఎంలతో ఎస్సీ ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌పై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్కు ఇంకా 122మంది ఆన్లైన్లో నమోదు కాలేదని, ప్రధానోపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చూడాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రు లతో మాట్లాడి వారికి అన్ని ధ్రువీకరణ పత్రాలు సమకూర్చే బాధ్యత తీసు కోవాలన్నారు. మార్చి 31లోపు విద్యార్థులందరికి స్కాలర్షిప్పులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఏ ఒక్క ఎస్సి విద్యార్థికి స్కాలర్ షిప్ అందలేదనే ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశానికి హాజరుకాని 16మందికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం డీఎస్డీఓ సునిత మాట్లాడుతూ కలెక్టర ప్రణాళికతో 2022లో 100శాతం ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చారని, దీంతో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.