Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
అ ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ-భూపాలపల్లి
రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ జెడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి తో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది రక్తదానం చేశారు. అంతకుముందు భూపాలపల్లి పట్టణం లోని హనుమాన్, సాయిబాబా దేవాలయం, మసీదు చర్చిలలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం మైనార్టీ స్కూల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా కేసీఆర్ జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణిసిద్దు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు భూపాలపల్లి ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మెన్ కళ్లెపు శోభరఘుపతిరావు, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్, టౌన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, కౌన్సిలర్లు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, జక్కం రవికుమార్, శారద నారాయణ, రేణుక, రవి, అనిల్, టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు సాంబమూర్తి పాల్గొన్నారు.
మైనారిటీ పాఠశాలలో
స్థానిక మైనారిటీ స్కూల, కళాశాలలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్‌లో రాణించాల న్నారు. స్కూల్ అభివృద్ధికి తనవంతు సహాయసహకారాలు ఉంటాయన్నారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి, ఎంపీపీ మందల లావణ్య, మైనారిటీ జిల్లా సంక్షేమ అధికారి బి సుని త ప్రిన్సిపాల్ టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జనగామరూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం జనగామ మండలం చౌడారం గ్రామంలో కస్తూర్బా పాఠశాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు మొక్కలు నాటారు. సర్పంచ్ ముక్క రాజయ్య, మాజీ సర్పంచ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. చెరుకూరు సిద్ధిరాములు, ముక్క వెంకటయ్య, సామి, మారగోని రమేష్ పాల్గొన్నారు.
నర్మెట్ట : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతకింది సురేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినంను ఘనంగా నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జెడ్పటీసీ మాలోతు శ్రీనివాస్, జెడ్పీ కో-ఆప్షన్ ఎండీ గౌస్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షులు అమెడపు కమలాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆగిరెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు కె మురళి, మాజీ మండల అధ్యక్షులు సుధాకర్, టౌన్ అధ్యక్షులు రవి పాల్గొన్నారు.
గణపురం : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలుసాని లక్ష్మి నరసింహరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సంక్షేమ పథకాలలో స్వర్ణయుగాన్ని తలపించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్, సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్, సొసైటీ చైర్మెన్ పొరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, గంగాధర్‌రావు, నారాయణ, కరుణాకర్‌రెడ్డి, చందర్ గౌడ్, వెంకన్న, జానయ్య, సురేష్ పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మండల ప్రజాప్రతి నిధులు పాల్గొని రక్తదానం చేశారు. గణపురం సొసైటీ చైర్మెన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలుసాని లక్ష్మీనరసింహారావు, సర్పంచులు నడిపెల్లి మధుసూదన్‌రావు, నారాగాని దేవేందర్‌గౌడ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బస్వా గాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామచం ద్రస్వామి దేవాలయం, చర్చి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నియోజకవర్గ వర్క్ కమిటీ చైర్మెన్ బొల్లంపల్లి నాగేందర్, జనగామ జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ఊడుగుల భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేష్, వైస్ ఎంపీపీ కిరణ్, మాజీ మండల అధ్య క్షులు వీరన్న, ఏఎంసీ డైరెక్టర్ రాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మంగమ్మయాదగిరి, సర్పంచులు శ్రీపాల్‌రెడ్డి, కుమారస్వామి, జయారాజేశ్వర్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధికార ప్రతినిధులు కరుణాకర్, నర్సింగ రామకృష్ణ, దేవస్థానం డైరెక్టర్ గోవర్ధన్,పీఏసీఎస్ డైరెక్టర్ బాలరాజు, జనగామ జిల్లా జాగృతి అధ్యక్షులు గంగాధర్ పాల్గొన్నారు
టేకుమట్ల : మండల కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామంలో వెంకటే శ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్, ప్రధాన కార్యదర్శి ఆకునూరు తిరుపతి, సర్పంచులు పొలాల సరోత్తమ్ రెడ్డి, నల్లబెల్లి రమా రవీందర్, నందికొండ శోభారాణి మహిపాల్ రెడ్డి, అడగని లతా రామారావు, ఉవెంద రావు, రాజేందర్, మహేందర్, ఎంపీటీసీలు వెంకటేశ్వర్‌రెడ్డి, సునీతరఘు పాల్గొన్నారు.
మహాముత్తారం : టీఆర్ఎస్ మహాముత్తారం మండల అధ్యక్షులు కలవచర్ల రాజు ఆధ్వర్యంలో యమన్‌పల్లి, కాటారం-మేడారం కూడలిలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. సర్పంచ్ బక్కయ్య. సీనియర్ నాయకులుకొండ చిన్న సమ్మయ్య, యూత్ అధ్యక్షులు సాగర్, దేవ్‌సింగ్, శ్రీకాంత్, దేవేందర్ పాల్గొన్నారు.
కొడకండ్ల : మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో మొక్కలను నాటారు. వరంగల్ డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి ఎంపీఈప జ్యోతి, మార్కెట్ చైర్మెన్ రాము మండల అధ్యక్షుడు రామోజీ, సర్పంచ్ మధుసూదన్ ఎంపీటీసీలు యాకయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు.
జఫర్గడ్ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్ చైర్మెన్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు
మహాదేవపూర్ : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బండం లక్ష్మరెడ్డి, మండల మహిళ విభాగం అధ్యక్షురాలు కుంభం స్వప్న, ఉపసర్పంచ్ సల్మాన్, బీసీ సెల్ అధ్యక్షులు కరెంగుల బాబురావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మెరుగు శేఖర్, యూత్ మండల అధ్యక్షులు అలీమ్, టౌన్ మహిళ అధ్యక్షురాలు చిలుక సునీత, యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, షిరిడి సాయిబాబా దేవస్థాన ఆలయ చైర్మన్ లక్ష్మన్, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ మహేష్, పాల్గొన్నారు..
కాళేశ్వరం ఆలయంలో
కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలపరిధి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో ఎంపీటీసీ రేవెల్లి మమతనాగరాజు ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు వెన్నెపురెడ్డి మోహన్‌రెడ్డి, సీనియర్ నాయకులు రేవెల్లి నాగరాజు, కాళేశ్వరం అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి సాయి,కార్యవర్గ సభ్యులు రాకేష్ చారి, రాజబాబు పాల్గొన్నారు.
అన్నారం గ్రామంలో
అన్నారం గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మల్లారెడ్డి వెన్నపురెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిచారు. ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు సమ్మయ్య, సోదారి నేత, టీఆర్ఎస్ అన్నారం ఉపాధ్యక్షులు పోచయ్య, గౌడ సంఘం నాయకులు నగేష్గౌడ,్ యాదవ సంఘం నాయకులు సమ్మయ్య పర్సవేనా పాల్గొన్నారు.
చిట్యాల : మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు . సామాజిక ఆసుపత్రిలో, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల నాయకులు చింతల రమేష్, గుర్రం తిరుపతి పండ్రల వీరస్వామి, మండల యూత్ ప్రెజిడెంట్ తౌటం నవీన్, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, సర్పంచ్ ఎరుకులపాటి పూర్ణ చందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎరుకొండ గణపతి, సురేష్, సర్పంచ్‌లు పుట్టపాక మహేందర్, అశోక్‌రెడ్డి ఎంపీటీసీ తిరుపతి పాల్గొన్నారు.
రేగొండ : కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేందర్ అన్నారు. గురువారం రేగొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పున్నం లక్ష్మి, జెడ్పీటీసీ సాయిని విజయ, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మట్టికే సంతోష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి నారాయణ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపి రెడ్డి, గండ్ర యువసేన మండల అధ్యక్షులు గంజి రజినీకాంత్, నాయకులు రవి, సాయిని ముత్యం, చిగురుమామిడి రాజు, రఘు సల తిరుపతిరావు, సుధన బోయిన విష్ణు, బిక్షపతి, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.