Authorization
Mon March 10, 2025 05:09:35 pm
'బీఎస్పీ అధికారం లోకి రావాలి'
నవతెలంగాణ-కాటారం
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధికారంలోకి రావాలని, తద్వారా బహుజన సమాజం అభివృద్ధి చెందుతుందని బీఎస్పీ మంథని నియోజకవర్గ అధ్యక్షుడు రామిల్ల రాకేష్ అన్నారు. శుక్రవారం కాటారం మండల కన్వీనర్ బొడ్డు రాజబాబు ఆధ్వర్యంలో వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ గెలుపొంది అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందన్, చంటి మల్లేష పాల్గొన్నారు.