Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీపీ మల్హర్రావు
నవతెలంగాణ-మల్హర్రావు
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీలో పని చేసిన ఫీిల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవా లని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. ఉపాధిహామీలో 2006-2019 వరకు నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగ భద్రత నిమిత్తం పలుమార్లు ప్రభుత్వానికి నివేదిక రూపంలో విన్నవించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. దీంతో అనివార్య పరిస్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. వారిని గుర్తించకపోగా పక్షపాత ధోరణితో ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. కాంక్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పి మోసగించిందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను క్రమబద్దీకరించకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదన్నారు. వెంటనే తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు అదేశించిందన్నారు. అయినప్పటికి వారిని విధుల్లోకి తీసుకోకపోవడం సంమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.