Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
ట్రూ టీచర్స్ కోయలేషన్ (టీటీసీ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రట రీగా కరీంనగర్ జిల్లా జమ్మికుం టకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యా యులు మోహన్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పాపగారి ఆశీర్వాదం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మోహన్ ప్రస్తుతం కాటారం మండలంలోని వీరపూర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధే లక్ష్యంగా టీటీసీ పనిచేస్తున్నదన్నారు. సంస్థ బలోపేతానికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నన్నారు. కాగా ఆయన ఎన్నిక పట్ల టీటీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భూపాలపల్లి జిల్లా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.