Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
మార్చి 1న రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామ బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటనుండి ప్రారంభమయ్యే బహుజన రాజ్యాధి కార యాత్రను జయప్రదం చేయాల ని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి జేరుపోతుల కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధి కుందారం గ్రామంలో మండల కన్వీనర్ శాడ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, బహుజనులు అందరూ మేలుకుని ఐక్య పోరాటా లు చేయాలన్నారు. మండలవ్యాప్తంగా గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కలు పుకొని కమిటీలు వేస్తున్నామన్నారు. ఈ నెల 22న మండల కమిటీని ఎన్నుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ నాయకులు ఆర్ సుధాకర్, అంబేద్కర్ యువజన సంఘం కుందారం అధ్యక్షులు పాలమాకుల ఆనంద్, చండిటి కేశవ, తాళ్లపల్లి రాకేష్, పలమకుల కరుణాకర్, యాకన్న, కళ్యాణ్, కార్తిక్, బాబు పాల్గొన్నారు.