Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్ధార్ అంజయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తహసీల్ధార్ కార్యాలయ ఆవరణలో మీసేవ ద్వారా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మండల ప్రజలకు మరింత సమాచారం కోసం తహసీల్ధార్ కార్యాలయంలో ఆధార్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహసీల్ధార్ ఫణీంద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రావు, మీసేవా నిర్వాహకులు బగుమహర్షి , తదితరులు పాల్గొన్నారు.