Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే
దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
మంథని నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాటశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన ఊరు - మన బడ'ి జామ్ మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ ఉన్నచోట అదనపు తరగతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి అదనపు గదులు నిర్మించే ప్రయత్నం చేయాలన్నారు. నియో జకవర్గంలోని పాఠశాలలు కొన్ని శిధిలావస్థలో ఉన్నాయని, వాటిని గుర్తించి నూతన భవనాలను మంజూరు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ప్రతి ప్రభుత్వ పాఠశాలను పెయింటింగ్స్, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాల న్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదవడనికి ప్రభుత్వం నుండి ప్రత్యేక సహాయం అందించాలన్నారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ప్రొజెక్టర్లు ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ నుండి యూనిఫామ్‌తోపాటు బెల్టు, షూస్, టై , నోట్ బుక్స్ తదితరవి అందజేయాలన్నారు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ మహిళా, పురుష ఉపాధ్యాయులకు వేరు వేరుగా టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సదరు పాఠశాలలను గుర్తించి టాయి లెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి స్కూల్లో అటెండర్, స్కావెంజర్ లేక ఉపాధ్యాయులే అటెండర్‌గా పనిచేస్తున్నారని అన్నారు. వెంటనే అన్ని పాఠశాలలో ఒక వర్కర్ ను నియమించాలని కోరారు. మన ఊరు మన బడి కి సంబంధించి ప్రతి పాఠశాలలో డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతుందనడం మంచిదే కానీ, అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం పై ప్రత్యేక శిక్షణ అందించాలని కోరారు.