Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
టీఆర్ఎస్ పాలనలోనే స్వరాష్ట్రంలోని జాతరలు, పుణ్యక్షేత్రాలు కళకళలాడుతున్నాయని ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని ములకలపల్లి,మొగుళ్ళ పల్లి గ్రామాల మధ్య జరిగే మినీ మేడారం జాతరను ఆయన సందర్శించి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారం జాతర ఆవిర్భవించినప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు జాతరను నాటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. వలసవాద పాలకుల నిర్లక్ష్యం మూలంగా జాతర ఉత్సవాలు సరిగా జరగలేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి పుష్కరాలు, మేడారం లాంటి పండుగలకు భారీగా నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రహ్మాండంగా నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంస్కృతీసాంప్రదాయాలకు నిలయంగా మేడారం జాతరను జరుపుకుంటు న్నామన్నారు. ఆయన వెంట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చదువు అన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి పున్నంచందర్ రావు, జిల్లా నాయకులు కొడారి రమేష్, సర్పంచ్‌లు మోటె ధర్మారావు, రాములు, చంద్రమౌళి, రాజేందర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, సునిల్‌రెడ్డి, కమిటీ చైర్మెన్ నరసింగరావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.