Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వరంగల్ డీసీసీబీ వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-కొడకండ్ల
గ్రామాల అభివద్ధే పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్యేయమని వరంగల్ డీసీసీబీ వైస్ చైర్మెన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నరసింగాపురం, మొండ్రాయి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులతోపాటు డ్రయినేజీ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగాపురం గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, మండల అధ్యక్షుడు సిందే రామోజీ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ దికొండ వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ వీరస్వామి, ఎంపీటీసీ యాకయ్య, విజయలక్ష్మి, సర్పంచులు దండంపల్లి శ్రీలత సోమయ్య, పెరుమాండ్ల ఊర్మిళ సోమయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.