Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మొగుళ్లపల్లి ములకలపల్లి రెండు గ్రామాల మధ్య జరిగే మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం పోటెత్తిన భక్త జనంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఎడ్లబండ్ల, ట్రాక్టర్ల ద్వారా సందర్శకులు జాతరకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారేసరికి పూర్తిస్థాయిలో జనసంద్రంగా మారింది. గురువారం సమ్మక్క రాకతో సందర్శకులు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ గ్రామాల నుంచే గాక ఇతర జిల్లాల నుండి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఎడ్ల బండ్లలో సైతం జాతరకు వివిధ గ్రామాల నుండి తరలివచ్చారు. గత జాతరకు పోటెత్తిన మాదిరిగా ఈసారి కూడా జనం పోటెత్తారు. ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున రావడంతో బ్రిడ్జి మీద రాకపో కలకు కొంత వరకు ఇబ్బంది తలెత్తింది. పోలీసు యంత్రాంగం వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎస్సై శ్రీధర్ సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రజలు సంతప్తి వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించడంలో జాతర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింగరావు, అన్నారెడ్డి, కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.