Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాలకవర్గానికి తప్పని ఇక్కట్లు
గ్రామాల వికాసానికి ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టి వివిధ అభివద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రకతి వనాలు, నర్సరీలు, పారిశుధ్యం మెరుగుకు ట్రాక్టర్లు, సెగ్రీగేషన్ షెడ్డు వంటి వాటిని సమకూర్చింది. క్షేత్రస్థాయిలో పాలన సాగించేందుకు సరైన భవనాలు లేక అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇందుకు మహాముత్తారం మండలమే నిదర్శనం.
నవతెలంగాణ-మహాముత్తారం
మండలవ్యాప్తంగా 24 గ్రామపంచాయ తీలు ఉన్నాయి. ఇందులో కొత్తగా 12గ్రామ పంచాయతీలు, పాతవి 12 గ్రామపంచాయ తీలు ఉన్నాయి. మొత్తంగా 10జీపీలకే పక్కా భవనాలు ఉన్నాయి. ఇవి కూడా ప్రస్తుతం శిథిలావస్థలోకి చేరుకున్నాయి. మిగిలిన 14 జీపీలు ప్రేమ్‌నగర్, నర్సింగాపూర్, సింగారం, స్తంభంపల్లి పీకే, రెడ్డిపల్లి, సింగంపల్లి, ఎత్నరం, నిమ్మగూడెం, మహబూబ్ పల్లి, పోలారం, మాదారం, గండికామారం, కొర్ల కుంట, వజినేపల్లి జీపీలను అద్దె భవనాలు, సంఘం భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర వాటిల్లో నిర్వహిస్తున్నారు. వాటిలో కనీస మౌలిక వసతులు కూడా లేక సమస్యల నడుమ పాలన సాగిస్తున్న దుస్థితి నెలకొంది. జీపీలకు సొంత భవనాల్లేక ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని వర్షంపడితే చాలు కురుస్తున్న పరిస్థితి. జీపీ కార్యాలయాల్లో మౌలిక వసతు లు లేక మహిళా సర్పంచులు, కార్యదర్శులు సుమారు 30మందితోపాటు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ప్రభుత్వం 'మన ఊరు-మన బడి కింద' పాఠ శాలలకు నిధులు మంజూరు చేసింది. దీంతో పాఠశాలల మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలల్లో నిర్వ హిస్తున్న జీపీలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసి పక్కా పంచాయతీ భవనాలు నిర్మించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇదే విషయమై జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, ఎంపీడీవో, ఎంపీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు.