Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
మండలంలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన నాస్తిక్ రాకేష్‌ను సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్ఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బైరి నరేష్, ఉప్పులేటి నరేష్‌లు ఆయనను రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకు, శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కషి చేస్తానన్నారు. శాస్త్రీయ విద్యా, సమాన విద్యా, ఉచిత విద్య కోసం పోరాటం చేస్తానన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీకి, సహకరించిన సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీకి ఆయన కతజ్ఞతలు తెలిపారు.