Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్ యాదవ్
నవతెలంగాణ-వరంగల్ లీగల్
ఎన్నో సమస్యలతో, నిత్య కలహాలతో, పౌర హక్కులు ధ్వంసమవుతున్న ప్రస్తుత తరుణంలో సమాజ సేవలో న్యాయవాద వత్తి కీలకపాత్ర పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, ప్రభుత్వ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్, ఫణీంద్ర భార్గవ్‌లు అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన న్యాయవాదుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదులు వలిశెట్టి గాంధీ, జేజే స్వామి, జోసెఫ్, నల్ల ప్రవీణ్, తులిపెగారి రాజబాబు, మడిపల్లి రజినీకాంత్‌లు ప్రమాణ స్వీకారం చేయగ.. వారు అభినందించి మాట్లాడారు. సామాజిక ఉద్యమాల్లో ఉన్నవారు, ప్రజల సమస్యలు తెలిసిన జర్నలిస్టులు, పదవీ విరమణ చేసినవారు, న్యాయవాద వత్తిలోకి రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందన్నారు. న్యాయవాద వత్తిలోకి నూతనంగా వచ్చిన వారికి న్యాయవాదులు సాయిని నరేందర్, సంజీవ్, అంకేశ్వరపు రాజేంద్రప్రసాద్, రంపీస రాజబాబు, నీరంజన్ రావు, ఎండీ రఫీక్, చింత నిఖిల్, రాచకొండ ప్రవీణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు