Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో
వృథా కానున్న పాకాల-రంగయ్య చెరువు ప్రాజెక్టులు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటనపై
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం
నవతెలంగాణ-నర్సంపేట
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం గోదావరి-కావేరి నదులను అనుసంధానంన చేసే కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రకటన చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలనే దుర్భుద్దితో ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను ఎడారిలా మార్చేందుకు అడుగడుగున అడ్డుపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏడు దశబ్దాల నీటి వాటాలను సీఎం కేసీఆర్ సాధించి.. నెర్రలు వారిన నేలలను నిండు జలలాతో నింపాడని తెలిపారు. తిరిగి సాగు నీటి నుంచి దూరం చేసేందుకు కేంద్రం ఈ అడ్డదారిని ఎంచుకుందని విమర్శించారు.
ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలంగాణ ప్రాజెక్టులు చట్ట విరుద్దమంటూ అనేక దఫాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేశాడన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం దురాలోచనను బయటపెట్టుకొందన్నారు. ఈ నిర్ణయం వల్ల వరంగల్ జిల్లాలే కాదు, నర్సంపేట నియోజవర్గాన్ని సస్యశామలం చేయనున్న పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ట్రయల్ రన్ కూడా విజయవంతమైందని, త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకోబోతున్న తరుణంలో కేంద్రం పిడుగు లాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు.
రామప్ప-పాకాల లింకు ప్రాజెక్టు చట్ట విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసిందని, దానిని ఆసరా చేసుకొని రెండేండ్లగా ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డుపడుతూ వచ్చిందని తెలిపారు. 5వ ప్యాకేజీలో రంగయ చెరువును రీడిజైన్ చేస్తే కేంద్రం కొర్రీలు పెట్టిందని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు గోదావరి జలాల నుంచి 6 టీఎంసీ నీటిని తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నదన్నారు. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇదే కొర్రీలతో అడ్డుపతోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం పైసా సహాయం చేయకపోగా.. సొంత నిధులతో నిర్మించుకొని దశబ్దాల రైతుల కలను నెరవేర్చుతున్న క్రమంలో కేంద్రం అడ్డుపడుతూ విషం చిమ్మడం దుర్మార్గమని దుయ్యపట్టారు. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ రైతులు నిరసనలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులపై కేంద్రం కుట్రలను మానుకోకపోతే రైతుల తిరుగుబాటుకు పతనం ఎదుర్కొకతప్పదని హెచ్చరించారు.