Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్
నవతెలంగాణ-కాజీపేట
గ్రేటర్ 44వ డివిజన్ పరిధిలోని అమ్మవారి పేట మినీ మేడారం జాతరం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వనదేవతుల ఇరువూర గద్దెలపై కొలువుదీరడంతో ఉదయం నుంచి రాత్రి వరకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించి బంగారాన్ని సమర్పించారు.వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జాతరను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, మడికొండ సీఐ రవికుమార్, ఎసై నరసింహారావులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్కింగ్ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వాహనదారులు గగ్గోలు పెట్టారు.