Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
రెండేండ్లకోసారి జరిగే శ్రీ గుంజేడు ముసలమ్మ మహాజాతరను మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించాలని ఆ జాతర ఆదివాసీ కోయ గిరిజన పూజారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోలెం వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న ఆలయ అధికారులను కోరారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో ముసలమ్మ ఆలయ ఆవరణలో ఆలయ ఈఓ భిక్షమాచారికి ఆదివారం వినతిపత్రం అందించారు. అనంతరం తోలెం వెంకటేశ్వర్లు, తోలెం వెంకన్న మాట్లాడారు. గుంజేడు ముసలమ్మ జాతర శుక్రవారాల్లో అత్యంత వైభవంగా, ఆదివాసీ సంస్కతి సాంప్రదాయాల నడుమ జరుగుతుందని తెలిపారు. అలాగే రెండేండ్లకోసారి నిర్వహించే మహాజాతరను మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మార్చి 16, 17, 18 తేదీల్లో నిర్వహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి తోలెం చిన్న నర్సయ్య, రాంబాబు, కిరణ్ కుమార్, నవీన్ కుమార్, అనంతరావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.