Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ మాల మహానాడు (టీఎంఎం) జిల్లా అధ్యక్షుడుగా మండల కేంద్రానికి చెందిన దాసరి లక్ష్మయ్యను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి తెలిపారు. మండల కేంద్రంలో బందెల యాదలక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రామ్మూర్తి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మధ్య చిచ్చుపెడుతున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం సభలు ఏర్పాటు చేసి, అనంతరం హైదరాబాద్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వర్గీకరణ కావాలనడం సిగ్గుచేటన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, హరీష్‌రావులను అయా పార్టీల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 25న మాలల ఐక్యత కోసం జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తామన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు బందెల రాజభద్రయ్య, నాయకులు ఉసిల్ల కుమార్, రేణుక, మేడ భార్గవి, విజరు, సులోచన, కల్పన, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.