Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసినా ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటున్నారు. వన దేవతలు వన ప్రవేశం చేసినపప్పటికీ.. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు మొక్కులు చెల్లించారు. వీరికి సిమెంట్ అధికారులు పూజారులు సౌకర్యాలు కల్పించారు. మొక్కులు చెల్లించిన అనంతరం మేడారం అటవీ ప్రాంతాలకు వెళ్లి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఆరగిస్తున్నారు.
కొనసాగుతున్న వైద్యసేవలు
మేడారం మహాజాతరలో భక్తులకు నెల రోజుల ముందు నుంచే డీఎంహెచ్ఓ అప్పయ్య ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. జాతర అయిపోయిన అనంతరం ఇప్పటికీ వైద్య సేవలు కొనసాగించారు.