Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
ములుగు జిల్లా కేంద్ర శివారులోని గట్టమ్మ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను నుగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బోదెబోయన బుచ్చయ్య ఆదివారం పరామర్శించారు. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన కంభంపాటి రమేష్, శ్రీను, జ్యోతి, చండ్రుపట్ల గ్రామానికి చెందిన బుద్ధ కళ్యాణ్ శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రమేష్, శ్రీను, జ్యోతి, కళ్యాణ్‌ల కుటుంబాలను బుచ్చయ్య ఆదివారం పరామర్శించారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చొరవ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బుచ్చయ్య వెంట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకష్ణారెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి సోమిడి నర్సింహారావు, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు గొంది రమణారావు, రైతుబంధు సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు తల్లడి నాని బాబు, సీనియర్ నాయకులు వనపర్తి సత్యనారాయణ, లొట్టపిట్టల రాంబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎగ్గిడి అంజయ్య, చింతూరు ధర్మారం సర్పంచ్‌లు బొల్లె సూర్యం, తెల్లం బుల్లెటేశ్వర్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొత్తగట్టు సాంబమూర్తి, గోవర్ధన శేషగిరి స్వామి, పీఏసీఎస్ డైరెక్టర్ బచ్చు సత్యనారాయణ, నాయకులు డాక్టర్ రమేష్, మిర్యాల రమణయ్య, కుదురుపాక రాములు, బుద్ధ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.