Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధన కమిటీ మండల కన్వీనర్ ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఫీజిబిలిటీ లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఉక్కు పరిశ్రమ సాధన కమిటీ మండల కన్వీనర్, మాజీ జెడ్పీటీసీ గౌని ఐలయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పరిశీలనలు, పరిశోధనల తర్వాత వచ్చిన నివేదికలు ఉక్కు పరిశ్రమకు అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మించిన వనరులు, సౌకర్యాలు బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఉన్నాయని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మండలంలో తక్షణమే ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేశారు.