Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయ్యప్ప కంగన్ హాల్, జనరల్ స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ-నెల్లికుదురు
వ్యాపారం యువతకు లాభమని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధ అన్నారు. మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అయ్యప్ప కంగన్ హాల్, జనరల్ స్టోర్‌ను సర్పంచ్ బీరవెల్లి యాదగిరిరెడ్డితో కలిసి రాధ ఆదివారం ప్రారంభించారు. అనంతరం రాధ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. యువత స్వయం ఉపాధి చేపట్టి మెరుగైన జీవనం సాగించడంతోపాటు ఇతరులకు అండగా నిలవాలని, స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. షాప్ ఏర్పాటు చేసిన వారిపెల్లి పూర్ణ దంపతులను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కుమ్మరికుంట్ల మౌనేందర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు తూళ్ల ప్రణరు కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సలుగు పూర్ణచందర్, వార్డ్ సభ్యులు పులి శ్రీను, హెచ్ రవి, రత్నపురపు యాకయ్య, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.