Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న
కేవీపీఎస్ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ-నెల్లికుదురు
అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడాలని ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరేటి వెంకన్న పిలుపునిచ్చారు. మండలంలోని మునిగలవీడులో కేవీపీఎస్ నూతన సంవత్సర డైరీని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు, సర్పంచ్ నల్లాని నవీన్రావుతో కలిసి వెంకన్న శనివారం రాత్రి ఆవిష్కరించి మాట్లాడారు. సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేవీపీఎస్ పాటుపడుతోందని చెప్పారు. ఐక్య పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు కోటయ్య, యాకాంతం, అశోక్, యుగేంధర్, తదితరులు పాల్గొన్నారు.