Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
నవతెలంగాణ-చిన్నగూడూరు
విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో జనరల్ సర్జన్లో ప్రవేశం పొందిన క్రమంలో డోర్నకల్ మండలంలోని జోగ్యాతండాకు చెందిన నందానాయక్-కైలా దంపతుల కూతురు బానోత్ ఇందును మండల కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్యే ఆదివారం అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తద్వారా సమాజానికి సేవ చేయాలని కోరారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో డోర్నకల్ వైస్ ఎంపీపీ వెంకట్రెడ్డి, అమర్ సింగ్, టీఆర్ఎస్ నాయకుడు ధారాసింగ్, మాజీ డైరెక్టర్ చెన్నయ్య, వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా మోసిన్ బేగ్, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, పిల్లి శ్రీరాములు పాల్గొన్నారు.