Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీ సోయం బాబురావుకు వినతి
నవతెలంగాణ-ములుగు
ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టేలా కృషి చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ముంజాల భిక్షపతి గౌడ్, ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావుకు మేడారంలో ఆదివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా భిక్షపతి, పైడి మాట్లాడారు. జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ గిరిజన జిల్లా పట్ల వివక్ష పాటిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో గుట్టమీద ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండెమీద వెంకటేశ్వర్లు, సామర్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.