Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాణా ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీలో చేరికలు
నవతెలంగాణ-నర్సంపేట
వచ్చే ఎన్నికల్లో నర్సంపేట నియోజవర్గంలో కాషాయ జెండా ఎగరవేయడం తధ్యమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ బహిష్కుత నాయకుడు గోగుల రాణాప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పలువురు బీజేపీలో చేరారు. గిర్నిబావి నుంచి ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహన ర్యాలీతో నర్సంపేటకు చేరుకున్నారు.ఆర్అండ్బీ గెస్టు హౌజ్‌లో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో రేవూరి మాట్లాడారు. రాణా ప్రతాప్ రెడ్డి, అతని అనుచరులు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికపై మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. మార్పు ఏ ఒక్క వ్యక్తి వల్ల కాదని ఐక్యమత్యంగా ఉంటేనే సాధ్యపడుతుందన్నారు. కొందరు దుష్టశక్తులు పార్టీలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తారని, ఇటీవల బీజేపీలోని కొందరు టీఆర్ఎస్కు కోవర్టులుగా పనిచేసి ఉన్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీల పిలుపుల మేరకు కార్యకర్తలు ఐక్యతగా పనిచేసి జెండా ఎగవేరవేసేందుకు కృషి చేయాలని సూచించారు. బీజేపీలో చేరిన రాణాప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తూ ప్రజాసేవ చేయడానికి చేరామని తెలిపారు. యువతకు ప్రాధ్యాన్యమిస్తూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కొండేటీ శ్రీధర్, మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, పట్టణాధ్యక్షులు బాల్నే జగన్, నాయకులు వడ్డెపెల్లి నర్సింగరావు, గుంటి వీరప్రకాష్, నల్లబెల్లి సుదర్శన్, చుక్క రమేష్, గోగుల ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.