Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
అత్యున్నత వైద్య సేవలు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్యులు, సంరక్ష క్లినిక్ వారు కషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం హన్మకొండలోని కాకాజీ కాలనీలో ఏర్పాటుచేసిన సంరక్ష స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనమందరం కషి చేయాలన్నారు. వైద్య వత్తి పవిత్రమైనదని, దాన్ని సామాజిక సేవగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా మేయర్ గుండు సుధారాణి, పరకాల, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, మాజీ చైర్మన్లు సాంబారి సమ్మరావు, మూగ రామ్ మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సంరక్ష హాస్పిటల్ చైర్మన్ సామ్యేల్, వైద్యులు భాస్కర్, పోలా నటరాజ్, రఘు, ఉషారాణి, దినేష్, కెేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.