Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ఆర్యవైశ్య పట్టణ సంఘం చేస్తున్న సేవలు రాష్ట్రంలోనే కాక భారతదేశంలోని ఏ కుల సంఘాలు చేయడం లేదని మాజీ మేయర్, ఆర్యవైశ్య పట్టణ సంఘం జిల్లా అధ్యక్షులు గుండ ప్రకాశరావు అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వాసవి మాత దర్శన్ తీర్థయాత్రకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని చౌరస్తాలోని సంఘం భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. పట్టణ సంఘం ద్వారా వస్తున్న ఆదాయంతో ఆర్య వైశ్యులకే కాక ఇతర సామాజిక వర్గాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్రాలు దర్శించ లేని ఆర్యవైశ్య పేదల కోసం 521 రూపాయలతో 8 పుణ్యక్షేత్రాలతో పాటు 102 అడుగులు గల వాసవి మాత ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ అవకాశాన్ని ట్రై సిటీలోని ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోనుపునురి వీరన్న, మల్యాల వీర మల్లయ్య, మంచూరి శ్రీనివాస్, పాపారావు, దొడ్డ మోహన్రావు, గార్లపాటి సంతోష్, వెనిషెట్టి కిషోర్, మంచాల విజరు కుమార్,తదితరులు పాల్గొన్నారు.