Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
నాచారం డివిజన్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు అఖిలపక్ష నాయకులు దళిత బంధు అమలు కోసం నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు సంఘీభావం తెలిపిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దళితులను మరోసారి మోసం చేశారన్నారు. దళిత బంధు కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచర గణానికి మాత్రమే ఇస్తున్నార న్నారు. ఇది ఇలాగే కొనసాగితే నిరుపేద దళితులు ఏం కావాలి అన్నారు. కేవలం ఎమ్మల్యేల అనుచరుల లబ్ది కోసమే ఈ దళిత బంధు పథకం మారిందన్నారు ఇష్టాను సారంగా ఇచ్చుడు కాదు ప్రతి నియోజకవర్గంలో అట్టడుగు దళిత వర్గాలను ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమంది దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. ఇంకా ఎంత సమయం పడుతుందో వెల్లడించా రన్నారు. దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేద న్నారు. వెంటనే ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదా రులను ఎంపిక చేసి త్వరగా అందజేయాలనీ, లేనిపక్షంలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని దళితులందరితో కలసి ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ ఇన్చార్జి మేడల మల్లికార్జున గౌడ్, నవీన్ రెడ్డి, ఫాసి ఉద్దీన్, రవి యాదవ్, రఘు, శ్రీ హరి, జంగం, అశోక్, ఆశన్న వాసు, పుల్లా ప్రశాంత్, గ్యారా కిరణ్, సాయి కుమార్, సాదినేని ప్రభాకర్, గొల్లూరి టోనీ ఫ్రాన్సిస్, సురేష్, దాసరి జగదీష్, రాకేష్, చింటూ, పాషా మొహ మ్మద్, సాజిద్ మొహమ్మద్, అమీర్ జావీద్, గడ్డ యుగేం దర్ శ్రీమూర్తి నాగరాజ్, గడ్డ క్రాంతి, కృపాకర్, సుగుణ, లీలావతి భారతమ్మ, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కిరణ్ కుమార్, వీబీ స్వామి, పవన్ గౌడ్, రాకేష్, రమేష్, మహేం దర్, రాహుల్, సురేందర్, ప్రవీణ్, వేణు పాల్గొన్నారు.